DRDO ADE Research Associate & Junior Research Fellow Jobs | DRDO Jobs Notification 2026

DRDO ADE Research Associate & Junior Research Fellow Jobs | DRDO Jobs Notification 2026

Defence Research and Development Organisation (DRDO) కు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ DRDO Jobs Notification 2026 Aeronautical Development Establishment (ADE) నుంచి Research Associate (RA) మరియు Junior Research Fellow (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భారత రక్షణ రంగానికి సంబంధించిన ఆధునిక టెక్నాలజీ పరిశోధనల్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

ఈ నియామకాల ద్వారా ఇంజినీరింగ్ మరియు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి పరిశోధన ప్రాజెక్టుల్లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తారు. DRDO ADEలో ఎంపికైన అభ్యర్థులు ఆధునిక విమాన సాంకేతికత, డ్రోన్ టెక్నాలజీ, కంట్రోల్ సిస్టమ్స్, అవియానిక్స్ వంటి రంగాల్లో పరిశోధన చేసే అవకాశం పొందుతారు.

POSTAL GDS MERIT LIST RELEASE 2026

🔰Organization Details

  • సంస్థ పేరు: Defence Research and Development Organisation (DRDO)

  • ల్యాబ్ పేరు: Aeronautical Development Establishment (ADE)

  • పోస్టుల పేరు: Research Associate (RA), Junior Research Fellow (JRF)

  • ఉద్యోగ స్థలం: బెంగళూరు, కర్ణాటక

  • కేటగిరి : రీసెర్చ్, ఫెలోషిప్

  • అప్లికేషన్ మోడ్ : ఇమెయిల్ ద్వారా
  • Total Vacancies : 08

🔰జాబ్ రోల్ మరియు పని వివరాలు:

DRDO Jobs Notification 2026 నోటిఫికేషన్ లో ఉన్న పోస్టులు ఏరోనాటిక్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ రంగాలలో రీసెర్చ్ పనిచేయాలి, ప్రయోగాలు, టెక్నికల్ అనాలసిస్ రిపోర్టు రైటింగ్ వంటి ఉంటాయి, సీనియర్ శాస్త్రవేత్తలకు జూనియర్ గా పని చేయాలి.

🔰Educational Qualification

DRDO ADEలో Research Associate మరియు Junior Research Fellow పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండాలి.

Research Associate (RA):

  • PhD పూర్తి చేసి ఉండాలి లేదా

  • M.E / M.Tech చేసి మంచి రీసెర్చ్ అనుభవం ఉండాలి.

Junior Research Fellow (JRF):

  • B.E / B.Tech లేదా M.E / M.Tech సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఉండాలి.

  • సాధారణంగా GATE Score ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ JRF పోస్టులకు గ్రాడ్యుకేషన్  డిగ్రీ  మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) రెండింటిలో ఫస్ట్ డివిజన్ తో M.E or M.Tech ఉండాలి.

సంబంధిత విభాగాలు:
Aeronautical Engineering, Mechanical Engineering, Electronics, Computer Science, Electrical Engineering వంటి విభాగాలు.

 🔰Age Limit DRDO Jobs Notification 2026

DRDO నియమాల ప్రకారం వయస్సు పరిమితి ఉంటుంది.

  • Research Associate – గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు

  • Junior Research Fellow – గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు

SC, ST, OBC మరియు ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

🔰Salary Details DRDO Jobs Notification 2026

DRDO ADEలో ఎంపికైన అభ్యర్థులకు మంచి స్టైపెండ్ అందిస్తుంది.

  • Research Associate (RA) – నెలకు సుమారు ₹67,000 వరకు + HRA

  • Junior Research Fellow (JRF) – నెలకు సుమారు ₹37,000 వరకు + HRA

ఈ స్టైపెండ్‌తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

🔰Selection Process DRDO Jobs Notification 2026

DRDO ADEలో ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ సాధారణంగా ఈ విధంగా ఉంటుంది.

  1. దరఖాస్తుల స్క్రీనింగ్

  2. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ

  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల విద్యార్హతలు మరియు పరిశోధన అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.

రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ పెడతారు, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు స్క్రీన్ టెస్ట్ ఉంటుంది.

🔰Application Process

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా మీ అప్లికేషన్ పంపించాలి.

దరఖాస్తు విధానం:

  1. DRDO అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.

  2. ADE Recruitment నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి.

  3. అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేయాలి.

  4. అవసరమైన వివరాలు భర్తీ చేసి అవసరమైన డాక్యుమెంట్లు జత చేయాలి.

  5. నోటిఫికేషన్‌లో ఇచ్చిన అడ్రస్ లేదా ఇమెయిల్‌కు పంపాలి.

  6. EMAIL: anjanaur.ade@gov.in

🔰DRDO Jobs Notification 2026 Required Documents

దరఖాస్తు సమయంలో ఈ క్రింది డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

  • విద్యార్హత సర్టిఫికేట్లు

  • GATE స్కోర్ కార్డ్ (ఉంటే)

  • ఆధార్ కార్డ్ లేదా ఇతర ఐడీ ప్రూఫ్

  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

  • రీసెర్చ్ పబ్లికేషన్స్ (ఉంటే)

NOTIFICATION PDF

APPLY FORM

OFFICIAL WEBSITE

IMPORTANT DATES:

అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : 04-03-2026

అప్లికేషన్ ఎండింగ్ డేట్: 24-03-2026

RA షార్ట్లిస్ట్ నోటిఫికేషన్: 31-03-2026

JRF స్క్రీనింగ్ టెస్ట్ & ఇంటర్వ్యూ : 07-04-2026

JRF ఇంటర్వ్యూ కంటిన్యూషన్ : 08-04-2026

RA ఇంటర్వ్యూ తేదీ : 09-04-2026

Why Join DRDO ADE?

DRDO ADEలో పనిచేయడం భారతదేశ రక్షణ రంగంలో కీలకమైన పరిశోధనల్లో భాగస్వామ్యం అయ్యే గొప్ప అవకాశం. ఇక్కడ పనిచేసే అభ్యర్థులు అధునాతన టెక్నాలజీలపై పనిచేసే అవకాశం పొందుతారు. అలాగే పరిశోధన అనుభవం పెంపొందించుకుని భవిష్యత్తులో మంచి కెరీర్ అవకాశాలను పొందవచ్చు.


FAQs

1. DRDO ADEలో ఎలాంటి పోస్టులు ఉన్నాయి?
Research Associate (RA) మరియు Junior Research Fellow (JRF) పోస్టులు ఉన్నాయి.

2. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉంటుందా?
లేదు. సాధారణంగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

3. JRF పోస్టుకు GATE అవసరమా?
సాధారణంగా GATE స్కోర్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

4. ఈ DRDO Jobs Notification 2026 ఉద్యోగాల జీతం ఎంత ఉంటుంది?
RA కు సుమారు ₹67,000 వరకు, JRF కు సుమారు ₹37,000 వరకు నెలకు స్టైపెండ్ ఉంటుంది.

5. DRDO Jobs Notification 2026 ఉద్యోగ స్థలం ఎక్కడ ఉంటుంది?
DRDO ADE ల్యాబ్ బెంగళూరులో ఉంటుంది.

    0Shares

    Leave a comment

    error: Content is protected !!