Air Force Agniveer Jobs 2026 – Latest Notification Details

Air Force Agniveer Jobs 2026- Latest Notification Details

Indian Air Force ద్వారా Air Force Agniveer Jobs 2026  నోటిఫికేషన్ త్వరలో విడుదల. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద యువతకు భారత వైమానిక దళంలో సేవ చేసే అద్భుత అవకాశాన్ని ఈ రిక్రూట్‌మెంట్ అందిస్తోంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు అర్హులు.

ఈ అగ్ని వీరు ఉద్యోగాలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ తో పాటు ఫిజికల్ టెస్ట్ లు ఉంటాయి. ఫిజికల్ మెజర్మెంట్ చూస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ చేసి మీకు ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Agniveer Vayu 2026 – ముఖ్యమైన వివరాలు

  • పోస్ట్ పేరు: Agniveer Vayu

  • సేవా కాలం: 4 సంవత్సరాలు

  • జాబ్ లొకేషన్: భారతదేశం అంతటా

  • రిక్రూట్‌మెంట్ విధానం: Online Test + Physical Test + Medical Test

Air Force Agniveer Jobs 2026 అర్హతలు (Eligibility Criteria)

విద్యార్హతలు:

  • సైన్స్ గ్రూప్:

    • ఇంటర్మీడియట్ (MPC) లేదా డిప్లొమా (ఇంజినీరింగ్)

  • నాన్-సైన్స్ గ్రూప్:

    • ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా

    • లేదా 10వ తరగతి + ITI

టెన్త్ అర్హతతో సొంత జిల్లా కోర్టులో ఉద్యోగాలు

వయస్సు పరిమితి:

  • ఈ అగ్ని వీరు ఉద్యోగాలకు 17.5 నుంచి 21 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు,అభ్యర్థి జననం నిర్దిష్ట తేదీల మధ్య ఉండాలి.

  • SC,ST – 5YEARS
  • OBC- 3YEARS 

ఈ పోస్టు సంబంధించి నాలుగు సంవత్సరాలు సర్వీస్ ఉంటది ఎవరైతే పెళ్లి కానటువంటి మహిళలు మరియు పురుషులు ఉంటారో వాళ్లు మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేసుకున్న ఛాన్స్ ఉంటుంది

Air Force Agniveer Jobs 2026 శారీరక ప్రమాణాలు (Physical Standards)

  • ఎత్తు: కనీసం 152.5 సెం.మీ

  • చెస్ట్: 77 సెం.మీ (విస్తరణ 5 సెం.మీ)

  • రన్నింగ్: 1.6 కి.మీ – నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి

  • పుష్-అప్స్, సిట్-అప్స్, స్క్వాట్స్ తప్పనిసరి

ఎంపిక విధానం (Selection Process)

Agniveer Vayu 2026 ఎంపిక విధానం కింది దశలుగా ఉంటుంది:

  1. Online Written Test

  2. Physical Fitness Test (PFT)

  3. Adaptability Test

  4. Medical Examination

  5. Final Merit List

అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే తుది ఎంపిక జరుగుతుంది.

జీతం & ప్రయోజనాలు (Salary & Benefits)

  • 1వ సంవత్సరం: ₹30,000 / నెల

  • 2వ సంవత్సరం: ₹33,000 / నెల

  • 3వ సంవత్సరం: ₹36,500 / నెల

  • 4వ సంవత్సరం: ₹40,000 / నెల

4 సంవత్సరాల సేవ పూర్తి చేసిన తర్వాత ₹10.04 లక్షల Seva Nidhi Package (ట్యాక్స్ లేకుండా) అందజేస్తారు.
అదనంగా:

  • ఉచిత వైద్య సదుపాయాలు

  • బీమా కవరేజ్

  • శిక్షణ & స్కిల్ డెవలప్‌మెంట్

అప్లికేషన్ విధానం (How to Apply)

  • అధికారిక వెబ్‌సైట్ ద్వారా Online Application చేయాలి

  • అప్లికేషన్ ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు సరిగ్గా నమోదు చేయాలి

  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి

  • అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి

ఇంపార్టెంట్ డేట్స్:

ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో ఉంటుంది జనవరి 12 నుంచి ఫిబ్రవరి ఒకటో తారీకు వరకు పెట్టుకోవచ్చు.

అప్లికేషన్ ప్రారంభం : జనవరి 12

అప్లికేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 01

పరీక్ష తేదీ : మార్చి 30,31 తేదీలు

ముఖ్యమైన సూచనలు

  • అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి

  • ఫేక్ వెబ్‌సైట్లు, మిడిల్‌మెన్‌లను నమ్మవద్దు

  • ఫిజికల్ ఫిట్నెస్‌పై ముందుగానే ప్రాక్టీస్ చేయాలి

ముఖ్యమైన లింకులు

DAILY JOBS UPDATES JOIN MY CANNELS

JOIN MY TELEGRAM

JOIN MY WHATSAPP CHANNEL

 JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES


.

    0Shares

    Leave a comment

    error: Content is protected !!