🔰పోస్ట్ ఆఫీస్ జిడిఎస్ రిజల్ట్స్ విడుదల | India Post GDS Result 2026 | Central Govt Jobs
India Post ద్వారా విడుదలైన India Post GDS Result 2026 కు దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పోస్టల్ శాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా Branch Post Master (BPM), Assistant Branch Post Master (ABPM), Dak Sevak వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
GDS పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అందువల్ల దరఖాస్తు చేసిన అభ్యర్థుల 10వ తరగతి మార్కుల శాతం ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి పోస్టల్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది.
India Post GDS Result 2026 ను అధికారిక వెబ్‌సైట్‌లో రాష్ట్రాల వారీగా PDF రూపంలో విడుదల చేస్తారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా మెరిట్ లిస్ట్ ఉంటుంది. అభ్యర్థులు తమ రాష్ట్రానికి సంబంధించిన PDF ను డౌన్‌లోడ్ చేసి అందులో తమ పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు.
🔰పోస్టల్ జిడిఎస్ రిజల్ట్ ఎప్పుడు విడుదల చేశారు:
Indian Post GDS Result 2026 march 06 తారీఖున రిలీజ్ అయింది, ఈ నోటిఫికేషన్ 31-01-2026 తేదీన వచ్చింది, ఆన్లైన్ దరఖాస్తులు 02-02-2026 నుంచి 16 ఫిబ్రవరి వరకు తీసుకున్నారు, ఫిల్ చేసిన దరఖాస్తులు ఏవైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి 18,19 ఫిబ్రవరి తేదీలు ఇచ్చారు, తర్వాత మెరిట్ లిస్ట్ తయారుచేసి 06-మార్చ్ 2026న 1st లిస్ట్ విడుదల చేశారు.
🔰India Post GDS Result 2026 ఎలా చెక్ చేయాలి?
అభ్యర్థులు తమ ఫలితాన్ని ఈ క్రింది విధంగా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
ముందుగా India Post అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in కు వెళ్లాలి.
హోమ్ పేజీలో GDS Result 2026 / Merit List అనే లింక్ పై క్లిక్ చేయాలి.
తర్వాత మీ రాష్ట్రానికి సంబంధించిన Merit List PDF పై క్లిక్ చేయాలి.
ఆ PDF ఫైల్ ఓపెన్ అయిన తర్వాత Ctrl + F నొక్కి మీ Registration Number లేదా Name ను సెర్చ్ చేయాలి.
మీ పేరు కనిపిస్తే మీరు ఆ పోస్టుకు ఎంపికైనట్లే.
🔰India Post GDS Result 2026 GDS Selection Process
India Post GDS ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇందులో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఎంపిక పూర్తిగా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులను తర్వాత Document Verification (DV) కోసం పిలుస్తారు.
🔰Document Verification కు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు
మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు DV సమయంలో ఈ క్రింది డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి.
10వ తరగతి మార్కుల మెమో / సర్టిఫికేట్
ఆధార్ కార్డ్
కాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైతే)
నివాస సర్టిఫికేట్
కంప్యూటర్ సర్టిఫికేట్ (అవసరమైతే)
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
DV పూర్తైన తర్వాత ఫైనల్‌గా అభ్యర్థులను పోస్టల్ శాఖలో నియమిస్తారు.
🔰GDS Salary Details
India Post GDS ఉద్యోగాలకు మంచి జీతం మరియు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి.
Branch Post Master (BPM) – ₹12,000 నుండి ₹29,380 వరకు
Assistant Branch Post Master (ABPM) / Dak Sevak – ₹10,000 నుండి ₹24,470 వరకు
ఇవి కాకుండా ఇతర అలవెన్సులు కూడా ప్రభుత్వం అందిస్తుంది.
🔰India Post GDS Result 2026 వయసు ఎంత ఉండాలి
ఈ పోస్టర్ జిడిఎస్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు వయస్సు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల వరకు ఉండాలి,SC,ST,OBC,PH క్యాటగిరి నిబంధనలకు వర్తి స్తుంది.
🔰ముఖ్యమైన విషయం
GDS మెరిట్ లిస్ట్‌లో పేరు రాకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పోస్టల్ శాఖ సాధారణంగా multiple merit lists విడుదల చేస్తుంది. మొదటి లిస్ట్ తర్వాత Second List, Third List వంటి అదనపు మెరిట్ లిస్ట్‌లు కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేస్తూ ఉండాలి.
India Post GDS ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరగడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి చూపిస్తున్నారు.
🔰STATE WISE / CIRCLE WISE MERIT LIST
ఇండియన్ పోస్ట్ వివిధ రకాల సర్కిళ్లను కలిగి ఉంది, Andhra pradesh circle , Telangana circle, Tamilnadu , Maharastra Circle ,Delhi circle ,UP circle , MP circle ఉంటాయి ప్రతి సర్కిల్ కి వేర్వేరుగా మెరిట్ లిస్టు విడుదలవుతాయి, ఇండియా పోస్ట్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వాళ్లు తమ మెరిట్ లిస్టు ని ఇండియా పోస్టల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
TELANGANA MERIT GDS MERIT LIST
🔰FAQs:
1. India Post GDS Result 2026 ఎప్పుడు విడుదల అవుతుంది?
సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తైన కొన్ని వారాల్లోనే మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
2. GDS ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష ఉంటుందా?
లేదు. ఎంపిక పూర్తిగా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
3. GDS Result ఎలా చెక్ చేయాలి?
indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌లో రాష్ట్రాల వారీగా విడుదల చేసిన PDF ద్వారా చెక్ చేయాలి.
4. మెరిట్ లిస్ట్‌లో పేరు వచ్చిన తర్వాత ఏమి జరుగుతుంది?
మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులను Document Verification కోసం పిలుస్తారు.
5. GDS Salary ఎంత ఉంటుంది?
BPM కు ₹12,000 – ₹29,380 వరకు, ABPM / Dak Sevak కు ₹10,000 – ₹24,470 వరకు ఉంటుంది.
